Saturday, 2 November 2013

కాలేజీ విధ్యార్దులు...

కాలేజీ విధ్యార్దులు-
విలాసాలకు ప్రసిద్ధులు...
చదువులలో శుద్ధమొద్దులు-
సినిమాలకు సర్వసిద్ధులు....
అల్లరిలో అసాధ్యులు-
పరీక్షలలో అయోగ్యులు...
ర్యాగింగ్లో హీరోలు-
ర్యాంకింగ్లో జీరోలు....     
చదువులలో వికర్షణ-
సినిమాలపై ఆకర్షణ.....
రెండింటికి సంఘర్షణ-
చివరకు కోల్పోతారు విచక్షణ...
గురువులపై భక్తిలేదు-
చదువులపై శ్రద్ధలేదు...
పరీక్షరాసే శక్తిలేదు-
పాసయ్యే ప్రసక్తేలేదు....
బందుల్లో ముందుంటారు-
క్లాసుల్లో వెనకుంటారు...
మహాత్మాగాంధీ ఎవరంటారు?
మాధురీదీక్షిత్ మా మనసంటారు 
       

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only