అట్టుగట్టిన మీగడ తిన్నావు
పట్టి కోడలు మూతిపై రాసినావు
పాలు పెరుగు వెన్నతిని గోల చేసేవు
కొంచమైనను నీతో వేగలేనురా
గోపకాంతుల వస్త్రాలను అపహరించి అల్లరి చేసినావు
గోపకాంతలంతలు వచ్చి చెబితే చాడీలు అన్నావు
నీకు కరువ ఇంట పెరుగు పాల కెపుడైన
కన్ను మూయలేదు కన్నతండ్రి కలలోనైనను
అల్లరి పనులను మానివుండు చిన్ని కృష్ణయ్య
గోవర్ధనమును గొడుగుగా పట్టినావు
మధురాపురమును కాపాడినావు
మన్ను తిన్నావని అన్న నాతో చెప్పగా
నోట భువనములన్ని జూపి మాయచేసేవు
భగవంతునిగా నా మదిలో నిలిచావు....
మిత్రులందరికీ శ్రీ కృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు
Post a Comment