అందమైన ఊహకి ప్రాణం పోస్తే నీవు..
నాహృదయ కవితకి భావం నీవు..
నా చిరునవ్వుకి కారణమే నీవు..
నా కన్నీటి సంద్రమే నీవు..
నేనే చూడని నా ఊపిరికి రూపం వస్తే అదే నీవు..!
కలగా మిగిలిన నా నిన్న లోని సంతోషమే నీవు..
వ్యధగా తోచిన నా నేటిలోని ఙ్ఞాపకానివే నీవు..
బాధవే అయినా ఇష్టంగా తోచే భావనవే నీవు..
నా హృదయస్పందన నీవు...
నా సర్వస్వం నీవు...
అర్ధమయ్యేది ఎప్పుడా అనే ఆశతో
నీ తోడుకై ఎదురుచూస్తూ...... నేను
నా హృదయానికి సర్వస్వం నీవు
Post a Comment