Friday, 11 April 2014

ఓ పరమేశ్వరా!


ఓ దయా సాగరా!
ఓ పరమేశ్వరా!
శరణమంటి ఓ శివా..
ఆనంద జలధిలో ఆడించు శ్రీకరా!
నాదీ నేనను చీకటితెరను
నీకు అడ్డముగా నిలబెట్టినావు..
ఆ తెర తొలగే మార్గము చూపి ఆదుకోవయ్యా...
బంధములు,అనుబంధములులో పడి బందీ అవుతున్న మాకు
ఆ అనుబంధమే నీవు అని తెలిపేది ఎప్పుడయ్యా???   
నిత్యము కానిది-సత్యమనుచు 
భ్రమలో పడి మెలుగుచున్న మాకు-
నిత్యమైనది-సత్యమైనది ,
ఆత్మరూపమని తెలియజేసేది ఎప్పుడయ్యా??
ఓ పరమేశ్వరా!!! 
మమ్ము కరుణించి,కాపాడువయ్యా....
జీవితానికి ఓ సార్ధకత కలిపించవయ్యా!!!
   

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only