నాకు నువ్వు ప్రమాణం చేసావు కదా..?జీవితాంతం కష్టమైనా సుఖమైనా నీతో నేనని, అవన్నీ వట్టి మాటలేనా.. ? వెలుతురు నాతో పంచుకున్న నువ్వు .చీకటిని ఎందుకు అసహ్యించుకున్నావ్..?
భయపడ్డావా..?నేనే కాదు, ప్రతి అమ్మాయి నాలాగే ఊహించుకుంటుంది..ప్రేమించిన వాడితో రంగులలోకం చూస్తుంది. జీవితం మొత్తం ఆనందంగా ఉంటుందని భ్రమ పడుతుంది..దెయ్యం ఉంటేనే దేవుడి విలువ తెలుస్తుంది... చెడు ఉంది కాబట్టే మంచికి విలువ ఉంది..నాతో ఉంటె సంతోషమే కాదు.. దుఃఖం కూడా ఉంటుంది... అదే నీకు చూపించాను. నేను నాలాగ ఉండి ప్రేమించాను. ప్రేమలో నటిస్తే నన్ను మర్చిపోవడం నీ తరం కాదు...!!!జీవితాన్ని పంచుకునే నీతో జీవితాంతం నటిస్తూ ఉండలేను బంగారు..కష్టాల్లో సైతం నాతోనే ఉంటావనుకున్నా...అందుకే నీకు జీవితం అంటే ఏంటో చూపించాను .కంటికిరెప్పలా ఉంటావనుకున్న...కన్నీరై జారిపోతావనుకోలేదు..నిన్ను బాధ పెట్టడం నా తప్పు...నన్ను వీడిపోవడం నీ... (తప్పూ అనే అర్హత లేదు)..ఏదైతేనేం ..అనుభవిస్తుంది నేను...నేను మాత్రమే...! నేను నీకు అర్ధం కావడానికి ఒక జీవితకాలం పడుటుందేమో....నేను మట్లాడితే అది గొడవ అంటావ్...నా ఇష్టాన్ని చెబితే నేను ఇంతే ఇలానే వుంటాను..ఎప్పటికి ఇలానే వుంటాను అంటావ్....ప్రేమిస్తున్న వారితో వుంటే గడియారం లేని కాలం కావాలి అనుకుంటాం..ఎంత మాట్లాడినా తరగనిది...తనివితీరనిది "ప్రేమ" లో వున్న కాలం....నీకు ఎప్పుడు అర్ధం అవుతుందో నాకు తెలెయదు...కానీ అప్పటి వరకు నీకోసం ఎదురుచూస్తూనే వుంటాను....ఈ క్షణం నువ్వు నన్ను అర్ధం చేసుకోకపోయినా నీతో వున్న ఆనంద క్షణాలను తలచుకుంటూ నీకోసం ఎదురుచూస్తూవుంటాను....ఎందుకంటే "నేను నిన్ను ప్రేమిస్తున్నాను".....
నీ ప్రేమను పొందలేనేమో కానీ,
నిన్ను ప్రేమించగలను...
నీతో కలసి జీవించలేనేమో కానీ,
నీకై మరణించగలను...
నీలో నేను లేక పోయినా
నీ తలపులలో సదా నేను గుర్తుకు వస్తుంటాను....
ఎందుకంటే నేను "నిన్ను ప్రేమిస్తున్నాను"....
Post a Comment