1) చేజారిన కాలం
పెదవి దాటిన పలుకు
వెనక్కి రావు
వాటిని ఎంతో జాగ్రత్తగా
వినియోగించుకోవటం
మౌనం వల్లనే సాధ్యం..
2) పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు.
బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.
3)అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు
ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి.
లేదా ఆ కాంతిని ప్రతిబింబించ
గలిగే అద్దంగా అయినా మారాలి.
4)నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,
ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
5) చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది.
కానీ జీవితం ముందు పరీక్ష
పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది.
6)ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం
ఆపినపుడు నీవు నీ అసలైన
జీవితపు ఆనందాన్ని పొందుతావు.
7) ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి
ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు.
అలాగే నడత చెడిందంటే ఎలాంటి
పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.
8) అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో.
ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని
లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
9) నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని
చూసి చీకటి భయపడుతుంది.
అలాగే నిరంతరం కష్టపడేవాడిని
చూసి ఓటమి భయపడుతుంది.
10)జీవితం అంటే నిన్ను
నువ్వు చూసుకోవటం కాదు,
నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.
Post a Comment