మెల్లగా పలకరించావు
చల్లగా నీళ్ళిచ్చావు..
అమ్మగా ఆదరించావు
కమ్మగా తినిపించావు...
జీవిత పయనంలో బాటగా ఎదురైనావు
నా జీవితానికి ఆదర్శంగా నిలిచావు...
ఆనందంగా ఉండమన్నావు
నీకోసం కాక నీ వారందరికోసం జీవించమన్నావు
జీవిత గమ్యానికి మధ్యగా వచ్చి మద్యలోనే వెనుతిరిగావు
ఆకాశానికి హద్దులు లేవు-
భూలోకానికి కొలతలు లేవు
నీవులేనిదే నా హృదయానికి స్పందనలేదు...
ఓ నేస్తం!
నీవు స్నేహంగా తిరిగివస్తావని ఆశతో.....
నా ప్రాణం పోయేదాక ఎదురు చూస్తుంటాను....
Post a Comment