Wednesday, 6 November 2013

ఆ సృష్టికర్తది ఎంతెంత అందం అని...???


తూరుపు కొండచాటున 
తొంగి చూస్తున్న ఉదయభానుడు!
పర్వత శ్రేణుల శిఖరాలపై 
ముద్దాడుతున్న గువ్వల జంటలు-
పచ్చని శిశిరంతో అలరారుతున్న 
కొమ్మల రెమ్మల నడుమ ఓ కాంతి పుంజం-
ప్రకృతి సోయగం విశ్వవ్యాప్తం ...
అంతా అందం ఆనందం...
నిద్ర పోతున్నాను..
ప్రపంచమంతా కలలోకి వచ్చింది..
ఆ కలలో-లాలించే అమ్మ,
ప్రేమను పంచే నాన్న ,ఙ్ఞానాన్ని పెంచే గురువు 
నాతో ఆడుకునే అక్కయ్య,అన్నయ,
నన్ను వదలని తమ్ముడు,చెల్లాయి,
ఎప్పుడూ ఎదురుచూసే స్నేహితులు,
అంతేనా.....
సహనానికి స్రీ మూర్తి ,
నిర్మలమైన పాపడి నవ్వు,
లావణ్య మూర్యులు తరుల్లతలు ,
ఇంకా ప్రశాంత గగనం ,
దానికి అలంకారంగా తారామణులు 
మాలిణ్యాన్ని కడిగేసే గంగ ,
కారుణ్యాన్ని కురిపించే దైవం ,
అన్నీ ప్రేమకు ప్రతిరూపాలే...
అందాలకు అనుబంధాలకు
ఆప్యాయతకు మారుపేర్లు...
అనురాగానికి దర్పణాలు...
మెలకువ వచ్చింది...
అప్పుడు అర్ధమైంది.. 
ఉత్తమోత్తమ మానవత్వం ,ఉదాత్త గుణం-
అన్ని ఆనందాలు కలగలిపిన 
అమ్మఒడి లాంటి అద్వితీయమైన 
ఆనందాలను పంచిన ఆ సృష్టికర్తది ఎంతెంత అందంఅని  ......... ?????

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only