అ మ్మగీసిన చిత్రాన్నినేను..
నాన్న రాసిన కావ్యాన్నినేను..
కొందరికి తెలిసిన నేను,
మరెందరికో తెలియను నేను..
ఎందరికో ఇష్టం నేను,
మరెందరికో కష్టం నేను....
నా ఆవేశానికి ఆదినేను,
నా అణ్వేషణకు అంతంనేను ..
నా ఆత్మాభిమానానికి అర్ధంనేను,
నా ఆలోచనలకు నియంత నేను...
నా మనస్సు ఎరిగిన నమ్మకం నేను,
నా తడబాటెరగని త్యాగం నేను...
నా స్నేహితులకి స్పూర్తి నేను,
నా శత్రువులకు భయం నేను....
నా గెలుపుకు గమ్యం నేను,
నా ఓటమికి ఓదార్పు నేను …
నా పంతానికి పట్టింపు నేను,
నా పౌరుషానికి ప్రతీక నేను....
నా భావాలకు భాష్యం నేను,
నా కన్నీటికి కారణం నేను…
నా బాధ్యతలకి బలం నేను,
నా కలలకు కారణం నేను.....
నా ఒంటరితనానికి తోడు నేను,
నా జ్ఞాపకాల గూ డునేను....
నా ప్రేమకి ప్రతిరూపం నేను,
నా ప్రాణానికి పేరు నేను...
నా ఉనికికి ఊపిరి నేను,
నా నిలువెత్తు సాక్ష్యం నేను...
మధురమైన మనోభావాల మణిహారాన్ని నేను...
మీ మనసులు తట్టగా కలం పట్టిన మణికుమారి నేను
నేను మణి అనే ఓ గనిని...
అద్భుతాలలో అద్భుతం నేను ....
Post a Comment