నింగిలోని జాబిలికి,నీటిలోని కలువకిమద్య
ఉన్నాయి ఎన్నోవెన్నల ఊసులు...
వాటికి తెలుసు ఆఊసులకి అర్ధంఏమిటో....
నీలిమేఘానికి,నాట్యమాడే నెమలికిమద్య
ఉన్నాయి మరెన్నోచినుకుమాటలు...
వాటికి తెలుసు ఆమాటలకు సంకేతమేమిటో....
ఉదయభానుడికి,విరిసే కమలానికిమద్య
ఉన్నాయి ఇంకెన్నో వెలుగుబాసలు...
వాటికి కుడా తెలుసు ఆమాటలకు ఆంతర్యమేమిటో?
నాహృదయానికి,నీమనసుకిమద్య
ఉన్నాయి ఎన్నెన్నో మూగచూపులు,మౌనరాగాలు
మరి నాకుతెలియదే...........
ఆ మూగచూపులకు "భావమేమిటో"!!
Post a Comment