మూగవోయిన నా హృదయానికి
జీవం తిరిగి రావడానికి నీవుంటే చాలు...
నిర్జీవమైందనుకున్న నా జీవితాన
వెన్నెల వానలు కురిపించటానికి నీవుంటే చాలు...
చేరలేననుకున్న నా గమ్యానికి కడదాకా తోడుండి
ముందుకు సాగటానికి నీవుంటే చాలు...
లోకమంతా ఏకమైనా
నా వెంట తోడుగా నీవుంటే చాలు...
ఓ నేస్తం!
నీవుంటే చాలు నాకు....
ఈ ప్రపంచంతో పని లేదు..
ఈ ప్రపంచమే అక్కర్లేదు ...
బీడువారిన నేలపై కురిసిన వాన చినుకులా-
నా జీవితంలో వెన్నెల వానలు కురిపిస్తావని -
ఆశతో....
Post a Comment