కలం రాస్తుంది భావి కలం
కలం రాస్తుంది భావికాల పరిస్థితులను
కాలం పాలిస్తుంది భవితను
శాసిస్తుంది కాలాన్ని కలం
పాలిస్తుంది దేశాన్ని కలం
గళం పలుకులు తెలిపేది కలం
గళం విలువలు పెంచేది కలం
చరిత్ర స్మృతిని కదిపేది కలం
ధరిత్రి గతిని తెలిపేది కలం
మనిషి మనస్సు మార్చేది కలం
మానస మనుగడలను కూర్చేది కలం
అందుకే కలమా !
నువ్వంటే ఎనలేని అభిమానం మా కవులకు...
Post a Comment