Thursday 7 November 2013

శ్రీకృష్ణ నామమే శరణం...


శ్రీకృష్ణ నామమే శరణం
శ్రీకృష్ణ గానమే మధురం
దురిత నాశనం మోక్షకారణం-
భవభయ సాగర తారకమంత్రం...
జగములనేలే జగదీశ్వరుడు-
జగద్రక్షకుడు శ్రీకృష్ణే...
ధర్మరక్షణకై అవతరించిన-
దివ్యపురుషుడు శ్రీకృష్ణే...
శ్రీకృష్ణ నామమే సకల భోగములు కాగలదు ఇలలో..
శ్రీకృష్ణ నామమే కైవల్యపధము అందజేయును తుదిలో...
మతమేదైనా గమ్యం ఒక్కటే
ధర్మమేదైనా సూత్రంఒక్కటే
సకలమతముల సారంఒక్కటే
శ్రీకృష్ణ,బాబా,అల్లాఒక్కటే....
సకల పాపప్రక్షాళన మార్గం -
నామ సంకీర్తన మొక్కటే ......            

Post a Comment

Contact Form

Name

Email *

Message *

Breaking News

[blogger]

favourite category

...
test section describtion

Whatsapp Button works on Mobile Device only