నీ చేరువునున్న ఒక్క క్షణం
ప్రపంచాన్ని జయిస్తాను....
నీ నవ్వుల సన్నిధిలో వుంటే
ప్రళయాన్నే ఎదిరించే గుండెబలం...
మొదటిసారి నా మదిని చేరి ,
నిదురలేపిన ఉదయానివి నీవు...
నా వయసులోని పసితనాన్ని ,
పలకరించిన ప్రణయనివి నీవు...
కనులు తెరిచినా,కనులు మూసినా
కనిపించెను నీ రూపం..
మాటలు వింటున్నా మౌనంగా ఉంటున్నా
వినిపించెను నీ గానం...
నువ్వు వీడనీయ్యక తియ్యని బంధంలా
అల్లుకున్న నీ మమకారం...
నీపై ఎనలేని అభిమానం.....
నాకు అన్నీ నువ్వే సుమా!
నన్ను ఎన్నటికి మరవకుమా!
నీ నుంచి నేను కోరుకునేది-
ఆకాశంత ఇష్టం కాదు......
అరచెయ్యంత ప్రేమ.....
నీ అరచేయిలో చేయి కలిపి చెబుతున్నా-
నీ స్నేహంగా జీవితాంతం తోడుంటానని-
జీవితమివ్వబోయే అనుభూతులపై
ఆశతో పసిపాప బోసినవ్వుతో
నీ ప్రాణం నీ మణి....
Post a Comment