నీవే నా ఆలోచన-
నా ప్రత్యర్ధయి నన్ను ప్రశ్నిస్తావు
నీవే నా ధైర్యం-
నా జీవనసమరానికి తోడుగా వున్నావు
నీవే ఓ నిజం-
తీపి అబద్ధాన్ని చీల్చేస్తావు
నీవే ఓ అగ్ని-
అన్యాయం పై నిప్పులు చెరుగుతావు
నీవే ఓ సముద్రం-
బడబాగ్నులను దాచుకుంటావు
నీవే ఓ మేఘం-
అనురాగాల్ని నిండుగా వర్షిస్తావు
నీవే ఓ త్యాగం-
స్వార్ధాన్ని దూరంగా తరిమేస్తావు
ఓ నేస్తం....
నీవే నా సర్వం-
లేదంటే ఆగిపోవును నా ప్రాణం...
Post a Comment