ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా,
నిర్భయంగా పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.
సూర్యుడు ఉదయించటం మరచినా,
సముద్రం అలలను మరిచినా,
సాయం చేయటం మరువనిది నిజమైన స్నేహం.
నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు,
నీ కష్టాలను కుడా పంచుకునే వాడు నిజమైన స్నేహితుడు.
వేయి మంది మిత్రులున్నా అది తక్కువే,
ఒక్క మిత్రుని పోలిన శత్రువున్నా అది ఎక్కువే.
మౌనం వెనుక మాటను,
కోపం వెనుక ప్రేమను,
నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.
షరతులు లేకుండా నీతో ఉండేవాడు,
ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు,
నీ స్నేహితుడు.
ఎంత మంది బంధువులున్నా,
అన్ని భావాలను పంచుకోగలిగేది
ఒక్క స్నేహితుడితో మాత్రమే.
తన మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు,
దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా వెళ్ళేవాడు
నిజమైన స్నేహితుడు.
నువ్వులేకుంటే నేను లేనని అనేది ప్రేమ అయితే,
నువ్వుండాలి, నీతో పాటు నేనుండాలి
అని ధైర్యాన్నిచ్చేది స్నేహం.
నీమీద నీకే నమ్మకం లేని సమయంలో కుడా
నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.
Post a Comment