"విషము పెట్టువాడు,
కొంపలు కాల్చువాడు,
భార్యను అవమానించువాడు,
ఆయుధము పట్టి నిరాయుధుడిఫై దాడి చేసేవాడు,
అటువంటి వారిని బ్రతికించుట వలన
ఎలాంటి ఉపయోగము లేదు"
ఏదైనా నీవు చేయగలను అనుకుంటే
చేయగలవు చేయలేను
అనుకుంటే చేయలేవు.
నమ్మకంలోని నాణ్యతే
నీకు నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది
"శక్తివంతుడై ఉండాలి,
ఓర్పు ఉండాలి,
దృఢ నిర్బయశక్తి తప్పనిసరి,
పవిత్రంగా బ్రతకాలి,
గొప్పలు చెప్పుకునే అలవాటు అస్సలు ఉండకూడదు.
వీటినే దైవీ సంపదలు అంటారు"
"ఈ ప్రపంచంలో దేనినైనా
"సంకల్ప శక్తి " ద్వారా సాధించవచ్చు లేదా అధిగమించవచ్చు"
"ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది.
కళలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు..
సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన
వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా "
"ప్రయత్నం ఎప్పటికి వృధా కాదు.
కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న ప్రయత్నమే
నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది"
"మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు
అలాగే కోపంతో రగిలిపోయే వారికి
సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు"
"మేఘం తొలగిపోయాక
అక్కడ ఉన్న సూర్యుడిని చూసినట్లు
అజ్ఞానం అంతరించాకే జ్ఞానం గోచరిస్తుంది"
"మన మనసును మనం నియంత్రించకపోతే
అది శత్రువులా పని చేస్తుంది"
"ఎవరైనా సరే అవసరమైనపుడు ధన ,
ప్రాణములపై ఆశలు వదిలి
ధైర్యముతో ముందుకు నడుస్తారో,
వారు ఎన్ని కష్టాలనైనా జయించగలరు"
"కోపం వలన మనిషి
తనను తాను మరచిపోయి ఆలోచన కోల్పోతాడు.
దాంతో బుద్ది కూడా నశిస్తుంది.
చివరకు నాశనం అవుతాడు"
"ఇతరులను అనుసరిస్తూ బ్రతికే బదులు ,
అపరిపూర్నంగా అయినా నీ జీవితాన్ని
నువ్వు కొనసాగించడం ఉత్తమం "
"కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి
నీ మనసు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి"
"ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని,
అసూయతో ఏడ్చే వాళ్ళను ఏడవని,
నువ్వు మాత్రం నీలాగే ఉండు,
ఎదో ఒక రోజు ఆ నవ్వినా వాళ్ళే,
ఏడ్చినవాళ్ళే మీ సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు. "
"భగవద్గీతలో స్పష్టంగా రాసి ఉంది .
దేనికి నిరాశ చెందనవసరం లేదు.
బలహీనమైది మన పరిస్థితులు మాత్రమే మనం కాదు"
"చేయడం అనేది తెలుసుకోవడం అంత సులభం అయితే ,
మానవులు అంతా దేవతలు అయి ఉండేవారు.
భూలోకం దేవలోకం అయి ఉండేది.
అందుకే ఆలోచన కన్నా ఆచరణ ప్రధానం ,
మాటల కన్నా చేతలు ప్రధానం ,
కర్మలను ఏ భావంతో ఎలా చేయాలో
కర్మ యోగం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసారు"
"ఏది జరిగిన మంచి కోసమే జరిగింది.
ఏం జరుగుతుందో మంచి కోసమే జరుగుతుంది.
ఏమి జరిగిన మంచి కోసమే జరుగుతుంది"
"మీకు పనిచేసే హక్కు మాత్రమే ఉంది,
దాని ఫలితంపై కాదు "
"మార్పు అనేది విశ్వం యొక్క నియమం"
"మీరు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు.
అలాగే ఖాళీ చేతులతో తిరిగి వెళతారు "
"మనిషి తన నమ్మకంతో తయారవుతాడు.
అతను ఏది నమ్ముతాడో అదే అతను"
"ఈ ప్రపంచాన్ని మించిన ప్రపంచం ఎలాగైతే లేదో..
అలాగే సందేహించేవారికి ఆనందం కూడా లేదు"
"మీరు పెద్దగా కలలు కంటున్నారా?
మీ లక్ష్యాలను సాధించకుండా మిమ్మల్ని ఆపేది ఏంటి?"
"ఒక వ్యక్తి తన మనసు యొక్క ప్రయత్నాల ద్వారా ఎదగగలడు.
లేదా అదే పద్దతిలో తనని తానే క్రిందికి లాక్కోగలడు .
ఎందుకంటే ప్రతి వ్యక్తికి తన సొంత స్నేహితుడు లేదా శత్రువు అతడే."
" నీ జీవితం ఒక యుద్ధ రంగం ..
దాన్ని నువ్వు పోరాడి గెలవాలి.
నువ్వు నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క"
Post a Comment