నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి....
‘‘నీ మోము చూడకముందే..
నీ స్వరం వినకముందే..
నీ గుణం తెలియకముందే..
నిన్ను నిన్నుగా ప్రేమించే గొప్ప వ్యక్తి అమ్మ"
మరో జన్మంటూ ఉంటే..
‘‘అమ్మ గురించి ఏమి చెబుతాం..
ఎంత చెప్పినా తక్కువే..
అయితే చెప్పాలన్న ఆశ ఆగడం లేదు..
నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలనుంది అమ్మా"
మనం ఉన్నంత కాలం..
‘‘అమ్మ ఉన్నంత కాలం మనం ఉంటాం కానీ..
మనం ఉన్నంత కాలం అమ్మ ఉండదు"
మన ఆనందంలోనే...
‘‘అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే..
మన ఆనందంలోనే తనను చూసుకునే ఏకైక వ్యక్తి అమ్మ"
కల్మషం లేని ప్రేమ..
‘‘గుడి లేని దైవం అమ్మ..
కల్మషం లేని ప్రేమ అమ్మ..
నా పెదవిన పలికే తీయనైన పదం అమ్మ..
నా గుండెలో మెదిలే ప్రతీ మాట నీవే అమ్మ"
కడుపులో పెట్టుకుని..
‘‘కడుపులో కాళ్లతో తంతున్నా..
పంటి బిగువన నొప్పి భరిస్తూ..
కని పెంచే బంధమే అమ్మ..
కన్న తర్వాత కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే గొప్ప దైవం అమ్మ"
జీవితాంతం తోడుగా..
‘‘నీ జీవితంలో ఎంత వద్దనుకున్నా..
నీకు జీవితాంతం తోడుగా నిలిచేది..
తల్లి ప్రేమ ఒక్కటే అని గుర్తంచుకో"
అద్భుతమైన స్నేహం...
‘‘అమితమైన ప్రేమ అమ్మ..
అంతులేని అనురాగం అమ్మ..
అలుపెరుగని ఓర్పు అమ్మ..
అద్భుతమైన స్నేహం అమ్మ..
అపురూపమైన కావ్యం అమ్మ..
అరుదైన రూపం అమ్మ"
చిన్న ఆపదొచ్చినా..
‘‘నీవు ఓడిపోతే నీ వెన్నంటే ఉండి..
నీకు ధైర్యం చెబుతూ నిన్ను విజయం వైపు నడిపించేది అమ్మ..
అంతేకాదు మనకు చిన్న ఆపదొచ్చినా మన కన్నా ఎక్కువ బాధపడేది అమ్మ"
నీవే ప్రపంచం అని..
‘‘నీ కంటూ వేరే ప్రపంచం ఉండొచ్చు..
కానీ అమ్మకు నీవే ప్రపంచం అని గుర్తుంచుకో"
గర్వంగా బతకాలని..
‘‘ ఏ అమ్మ అయినా తన బిడ్డను ఎందుకు చదివిస్తుందంటే..
తన ఆకలి బాధ తీరుస్తాడని మాత్రం కాదు..
తన బిడ్డ ఒక ముద్ద కోసం ఎవ్వరి ముందు
చేయి చాపకుండా గర్వంగా బతకాలని"
అమ్మ ఒడి మాత్రమే..
‘‘నీవు బాధలో ఉన్నప్పుడు..
అన్నీ బంధాలు ఇవ్వలేని ఓదార్పు
ఒక్క అమ్మ ఒడి మాత్రమే ఇస్తుంది"
అమ్మ ప్రేమ ఒక్కటే..
‘‘చదువు రాని అమ్మ కూడా బిడ్డకు బుద్ధి చెప్పగలదు..
డబ్బు లేని అమ్మ కూడా తన బిడ్డల కడుపు నింపగలదు..
కళ్లు లేని అమ్మ కూడా తన బిడ్డకు వెలుగు దారి చూపగలదు..
అందుకే ఎలాంటి అవరోధాన్నైనా లెక్కచేయనిది అమ్మ ప్రేమ ఒక్కటే"
రవ్వంత రుణాన్ని..
‘‘జీవితాంతం నీ తల్లిని భుజాలపై మోసి సేవ చేసినా..
ఆ తల్లి ప్రసవవేదన రోజు అనుభవించిన బాధలో
కనీసం రవ్వంత రుణాన్ని కూడా నీవు తీర్చలేవు"
అక్కడి నుండే నీ కథ..
‘‘నీ ప్రతి కథ వెనుక తల్లి కచ్చితంగా ఉంటుంది..
ఎందుకంటే అక్కడి నుండే నీ కథ మొదలవుతుంది..
ప్రేమను మాత్రమే పంచుతూ..
‘‘ఆకాశమంత మనసు ఉండి..
భూదేవంత సహనం ఉండి..
సముద్రమంతా కరుణ ఉండి..
ప్రేమను మాత్రమే పంచుతూ అక్కున చేర్చుకునేదే అమ్మ"
ఎప్పటికీ ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేను
‘‘ఈ విశ్వంలో అందం,
ఐశ్వర్యం చూడకుండా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ..
నా తల్లి ప్రేమ నిర్మలమైనది దానికి ఎప్పటికీ ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేను"
తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు
‘‘స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం..
ఎవ్వరి కోసం ఆగదు..
మనమే దాన్ని ఆపాలి..
వేరే వాళ్ల గురించి ఆలోచించొద్దు..
వాళ్లెవ్వరూ నీ కన్నా గొప్పొల్లు కాదు..
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు"
Post a Comment